కలం, డెస్క్ : అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా నటించిన సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన భార్య నటించిన, తమ కుటుంబ స్వీయ కథా చిత్రం ఇదీ అనీ.. టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఆయన పోస్ట్ చేశారు. ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడానికి 20 రోజుల ముందు మెలానియా జీవితంలో ఏం జరిగిందనే ఇతివృత్తంతో ఒక గంట 40 నిమిషాల నిడివితో రూపొందిన ఈ డాక్యుమెంటరీ మూవీకి ‘మెలానియా’ (Melania Trump Movie) అని పేరుపెట్టారు.
ఇందులో మెలానియా (Melania Trump), ఆమె భర్త ట్రంప్ సహా కుటుంబ సభ్యులు నటించారు. హాలీవుడ్ డైరెక్టర్ బ్రెత్ రత్నర్ (Brett Ratner) తెరక్కించారు. మెలానీయా సొంత నిర్మాణ సంస్థ ‘మ్యూజ్ ఫిల్మ్స్ ’ (Muse Films) ఈ ప్రాజెక్టును చేపట్టింది. థియేటర్లలో విడుదలైన రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ (Amazon) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా ఇది స్ట్రీమ్ అవుతుంది. మెలానీయా నిర్మించిన ఈ మొదటి చిత్రం బడ్జెట్.. దాదాపు రూ. 340 కోట్లు! ‘‘మెలానియా మూవీని మీరంతా తప్పక చూడండి. అమెజాన్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి.. టికెట్లు చాలా ఫాస్ట్ గా అమ్ముడుపోతున్నాయి” అంటూ సినిమాకు హైప్ ఇచ్చేలా ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Read Also: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఫ్రాన్స్ లో కీలక బిల్లు
Follow Us On: X(Twitter)


