Mobile Popup Ad
Mobile Popup Ad

రెస్టారెంట్లలో వినియోగిస్తున్న డొమెస్టిక్ సిలిండర్లు సీజ్

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలో పలు రెస్టారెంట్ల యజమానులు డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తూ పట్టుబడ్డారు. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా కొంత మంది వ్యాపారులు హోటళ్లు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడటం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు శనివారం ఖమ్మం (Khammam) టౌన్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో మొత్తం 20 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా వాడుతున్న మొత్తం 20 డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను సీజ్ చేయడంతో పాటు, సంబంధిత హోటల్ యజమానులపై కేసులు కూడా నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

డొమెస్టిక్ సిలిండర్లు ప్రభుత్వ సబ్సిడీపై, సామాన్య గృహస్తుల కోసం మాత్రమే అందించబడతాయని, వాటిని వాణిజ్య అవసరాల కోసం దుర్వినియోగం చేయడం ఎసెన్షియల్ కమోడిటిస్ యాక్ట్ 1955 సెక్షన్ 6A కింద శిక్షార్హమైన నేరం కావున, వాణిజ్య సంస్థలు కేవలం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు మాత్రమే వాడాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>