క్లినిక్‌లో స్పై కెమెరా.. 3 వేల సీక్రెట్ వీడియోలను రికార్డ్ చేసిన డాక్టర్

కలం, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని రాజకోట్‌లో (Rajkot) ఓ వైద్యుడు సహచర వైద్యురాలిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు క్లినిక్‌ డెలివరీ రూమ్‌లో స్పై కెమెరా (Spy Camera)ను అమర్చాడు. కమల్ నందా అనే డాక్టర్ బల్బ్ హోల్డర్‌లో కెమెరాను దాచి పెట్టి దాదాపు 3,000కు పైగా వీడియోలను రికార్డ్ చేశాడు. 2023 నుంచి ఈ నిఘా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో మహిళా వైద్యురాలి వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేశాడు. వాటిని బయటపెడతానని బెదిరిస్తూ మానసికంగా వేధించాడు.

ఈ వ్యవహారంలో బాధితురాలిని భయపెట్టి రూ.25 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. ఇప్పటికే కొంత మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం. ఈ కుట్రలో నిందితుడికి సహకరించిన మరికొందరు వ్యక్తులు, నకిలీ జర్నలిస్టుల పేర్లను కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. రాజకోట్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐటీ చట్టం, దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వృత్తిపరమైన క్లినిక్స్‌లో ఇలాంటి భద్రతా ఉల్లంఘన జరగడం స్థానికంగా కలకలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>