చేవెళ్ల డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి : డీహెచ్‌పీఎస్

కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద డీహెచ్‌పీఎస్ (DHPS) రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం అసైన్‌మెంట్ భూములకు హక్కులు కల్పించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్ మాట్లాడుతూ అసైన్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

దళితులపై ఇప్పటికీ గ్రామాల్లో పట్టణ కేంద్రాల్లో కుల వివక్షత అంటరానితనం ఉందని దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెడుతున్నాయని వారు అన్నారు. దళితుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పట్టణ కేంద్రంలో నివసిస్తున్న నిరుపేదలకు అర్హులైనటువంటి నిరుపేద లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు, కానీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించకుండా దళిత కుటుంబాలకు విద్యా ఉపాధి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ప్రభుత్వాన్ని ఇరుగురాల భూమేశ్వర్ డిమాండ్ చేశారు.

12 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు మొనుగురి హనుమంత్, జిల్లా సహాయ కార్యదర్శి కొండ రాజయ్య, అచ్చ ప్రవీణ్, గాద దేవదాస్, బొల్లె లక్ష్మీరాజం, బొమ్మన పురుషోత్తం, రాచర్ల నరేష్, సిగిరి రాజ్ కుమార్, మచ్చ అంజయ్య, ఆత్మకూరు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>