కలం, వెబ్‌డెస్క్: సింహాచలం గిరి ప్రదక్షిణ (Simhachalam Giripradakshina) లో భక్తులకు చుక్కలు చూపించింది. పోలీసులు, అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినా తీవ్రమైన అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు రూట్ మ్యాప్‌పై అవగాహన లేకపోవడంతో హైవే ఎక్కేశారు. ఒకేసారి వేలాది మంది భక్తులు రోడ్డుపైకి రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
భక్తులు రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హనుమంతవాక, మద్దిలపాలెం, తాడిచెట్లపాలెం జాతీయ రహదారి మొత్తం భక్తులతో నిండిపోయింది. హనుమంతవాక జంక్షన్లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పోటెత్తిన రద్దీతో అట్ ట్రాఫిక్‌ను, ఇటు భక్తులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అస్వస్థతకు గురైన భక్తులు రోడ్డు పక్కన కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు.

