వీర నాగమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

కలం, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం మాడుగుల (Madugula) మండలం దొడ్లపహాడ్ గ్రామంలో వీరనాగమ్మ దేవత ఆలయంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయింది. 41 రోజుల పూజా కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా సోమవారం మండల పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నేత, టాస్క్ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా రూ.1.80 లక్షలు అందించి పెయింటింగ్ పనులు పూర్తి చేయించారు.

అనంతరం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి ద్వారా గ్రామ ప్రజల మధ్య ఐక్యత మరింత బలపడుతుందని తెలిపారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకారం అందించిన రాఘవేందర్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మట్ట నాగయ్య, మట్ట యాదయ్య, అర్జున్, మల్లేష్, శ్రీను, శంకర్, రాజు, నాగరాజు, వెంకటేష్, సురేష్, సత్తయ్య, యాదగిరి, నాగేష్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>