కలం, కల్వకుర్తి: కల్వకుర్తి (Kalwakurthy) మండలం గుండూరు గ్రామ శివారులో సోమవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లపై నిఘా పెట్టినట్లు వివరించారు.

