హాంకాంగ్ అగ్ని ప్రమాదం.. 128కి చేరిన మృతుల సంఖ్య

హాంకాంగ్(Hong Kong) అగ్ని ప్రమాద మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొదటి రోజు 13గా ఉన్న మృతుల సంఖ్య.. శుక్రవారం ఉదయానికి 128కి చేరిందని అధికారులు చెప్పారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు మరో 200 మంది ఆచూకీ లభించకపోవడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరో 200మందికి పైగా మంటల్లో చిక్కుకుని ఉన్నారని అధికారులు తెలిపారు.

Hong Kong | ప్రమాదం బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌ సముదాయంలో చెలరేగిన అగ్ని వేగంగా పక్కనే ఉన్న ఇతర టవర్లకు వ్యాపించింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు వెయ్యి మంది ఫైర్‌ఫైటర్లు 24 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. కాగా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Read Also: భారత్ పర్యటనకు పుతిన్.. షెడ్యూల్ ఇదే..

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>