ఆస్తి కోసం తల్లిదండ్రుల ఇంటికి నిప్పుపెట్టిన కూతురు

కలం, వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిలుకలూరిపేట మండలం గుర్రాల చావిడి గ్రామంలో ఆస్తి కోసం ఓ కూతురు సొంత తల్లిదండ్రులనే చంపాలనుకుంది. వివరాల్లోకి వెళితే.. కూతురు చంద్రిక తరచూ తన తల్లిదండ్రులతో ఆస్తికోసం గొడవపడుతూ ఉండేదని తల్లి సుఖన్య తెలిపింది. అయితే ఈ వివాదం ముదరడంతో విచక్షణ కోల్పోయిన కూతురు.. తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటికి నిప్పు పెట్టింది.

మంటలు గమనించిన తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగుతు తీశారు. సకాలంలో వారు బయటకు రావడంతో పెను ప్రమాదమే తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఘటనలో ఇంటిలోని ఫర్నీచర్ మొత్తం అగ్నికి ఆహుతైంది. దీంతో తల్లిదండ్రులు నిందితురాలు చంద్రికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>