అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ మహిళ దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ (31) (Daram Supriya) ఉద్యోగ రీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న భారత్‌కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సుప్రియ మృతితో మరిపెడలోని విషాద ఛాయలు అలముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>