కలం, సినిమా : ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాట ఆధారంగా రూపొందించిన అభ్యంతరకర AI వీడియో వివాదంపై సినీ ప్రముఖులు వరుసగా పోస్టులు చేయడాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు (RGV Comments). సెలబ్రిటీలు ఆయా అభ్యంతరకర లింకులు, కంటెంట్ గురించి సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం వల్ల ఆ వీడియోలకు మరింత ప్రచారం లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రకమైన కంటెంట్‌ను కోట్లాది మంది దృష్టికి తీసుకెళ్లేలా పదే పదే మాట్లాడే బదులు, దానికి బాధ్యులైన నిందితులను పట్టుకోవడంపై అసలు దృష్టి పెట్టాల్సిందని పేర్కొన్నారు. బాధితురాలికి, ఆ అభ్యంతరకర కంటెంట్‌కు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు చేయడం కూడా తప్పేనని RGV స్పష్టం చేశారు.

