దంతలబోర వాసుల ఏళ్లనాటి కల సాకారం.. ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభం

కలం, ఖమ్మం బ్యూరో: మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ప్రజారవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి, ప్రతి పల్లెకూ ఆర్టీసీ బస్సు సేవలను విస్తరిస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని నారాయణరావుపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాల్వంచ-దంతలబోర ఆర్టీసీ బస్సు సర్వీసును ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

దీంతో దంతలబోర వాసుల ఏళ్లనాటి ప్రయాణ కల నెరవేరడంతో గ్రామీణులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల ప్రధాన రహదారుల సమస్యను ఇప్పటికే పరిష్కరించామని, అతి త్వరలోనే అంతర్గత రహదారుల నిర్మణ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సురక్షితమైన ప్రయాణాన్ని అందించే ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగసీతారాములు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>