బీఆర్‌ఎస్‌లోకి పెద్దమందడి కాంగ్రెస్ నాయకులు

కలం, వనపర్తి: పెద్దమందడి (Peddamandadi) మండలం స్కూలుతండాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో గ్రామ యువ అధ్యక్షుడు ఎం.రాకేష్‌తో పాటు శ్రీను, లచ్చ, రమేష్, ఛతురు, నారమ్మ, ముత్యాలమ్మ, నిజామా, నరేష్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయామని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>