సైబరాబాద్ సీపీ కీలక నిర్ణయం.. 32 మంది ఎస్సైల సరెండర్

కలం, వెబ్ డెస్క్: సైబరాబాద్ సీపీ (Cyberabad CP) డాక్టర్ ఎం.రమేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 32 మంది ఎస్సైలను వారి మాతృ జోన్ అయిన చార్మినార్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన కారణాలతో వారిని సరెండర్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఎస్సైల సరెండర్‌ అంశం.. కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది.

సీఐల బదిలీలు.. అంతలోనే వెనక్కి..?

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ (Cyberabad CP) పరిధిలో 63 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వారికి మరో చోట కొత్త పోస్టింగులు ఇస్తూ నిన్న సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలను మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఒకేసారి ఈ స్థాయిలో సీఐలను బదిలీ చేసి, అంతలోనే ఆ నిర్ణయాన్ని ఎందుకు నిలుపుదల చేశారనేది కమిషనరేట్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Read Also: తల్లి ఆశీర్వాదం తీసుకున్న డీజీపీ సీవీ.ఆనంద్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>