అర్హులకు ఇళ్లు ఎప్పుడు? గన్నేరువారంలో సీపీఐ ధర్నా!

కలం, కరీంగనర్: గన్నేరువారం (Ganneruvaram) మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములు అర్హులకు కేటాయించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు ధర్నా (CPI Protest) చేపట్టారు. దీనికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి అసంపూర్తిగా నిర్మించిన డబుల్ రూములను మండల వ్యాప్తంగా అర్హులను గుర్తించి వారికి అందజేయాలని కోరారు. మరోపక్క నిర్మించిన ఇండ్లు కూలిపోతుండటంపై వారు మండిపడ్డారు. కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్ వాడి లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సదరు కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన వారికే కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ రఫీకి వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతల అంజిరెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, సహాయ కార్యదర్శులు కూన మల్లయ్య, పిప్పల కనుకయ్య, గుండ్లపల్లి గ్రామ కార్యదర్శి బోయిని తిరుపతి, గన్నేరువారం గ్రామ కార్యదర్శి బోయిని మల్లయ్య, మాదాపూర్ గ్రామ కార్యదర్శి గాజుల లక్సమన్, కొండాపూర్ కార్యదర్శి ఆంజనేయులు, మండల నాయకులు, ఎండీ యువజన నాయకులు మోలుగురి ఆంజనేయులు, నాయ్యుమ్ బిట్ల శ్రీనివాస్, శంకర్, జలపతి, సంబు తిరుపతి, పంబాల ఆంజనేయులు, బుట్ల భాస్కర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>