కలం, పెద్దపల్లి : కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ ప్రజా చైతన్య యాత్రను సుల్తానాబాద్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సోమవారం ప్రారంభించారు. అనంతరం సదానందం మాట్లాడుతూ, దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని విమర్శించారు.
విద్యార్థులకు చదువుకునే హక్కు లేకుండా పేపర్ లీకేజీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును చెలగాటం ఆడుతున్నదని ధ్వజమెత్తారు. మతతత్వాన్ని పోషిస్తూ కులమతాల మధ్య చిచ్చు పెడుతూ దేశంలో అశాంతికి కారణమవుతుందని, ధరల పెరుగుదలతో సామాన్యుల బతుకులు ఆగం చేస్తూ, దేశ సంపదను బడా బాబులకు ధారాదత్తం చేస్తున్నదని ఆరోపించారు.
అందుకే సీపీఐ ఆధ్వర్యంలో బీజేపీ హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో సెప్టెంబర్ 1న ఢిల్లీ రాజధానిగా రామ్ లీలా మైదాన్ భారీ బహిరంగ సభ సిపిఐ ఆధ్వర్యంలో జరగబోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం జయప్రదం కోసం దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని సదానందం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోశికమోహన్, కే కనకరాజు, మార్కాపూరీ సూర్య, కోడం స్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి మల్లయ్య, ఎం.ఎల్లయ్య, ఎజ్జ రాజయ్య, ఓదమ్మ, పూసల రమేష్, ప్రీతం, శనిగరపు చంద్రశేఖర్, తోడేటి లావణ్య, రచన, తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, గట్టయ్య, ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నారు.
Also Read : టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు ముహూర్తం ఫిక్స్ !
Follow Us On: Instagram

