కలం, కరీంనగర్: తన సొంత ఖర్చులతో ఎంఐఎం పార్టీ ద్వారా ప్రజలకు మినరల్ వాటర్ అందిస్తున్న ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్ (Ghulam Ahmed Hussain) సేవలు అభినందనీయమని సీపీ గౌస్ ఆలం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) అన్నారు. మొన్న వినాయక నిమజ్జనంలో హిందూ సోదరులకు.. నేడు జమాతీ ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ముస్లిం సోదరులందరికీ నీళ్లు అందించారని చెప్పారు. సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్ సేవలను జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా వలిఉల్లా సయ్యద్ ఫలాహి, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్ సైతం అభినందించారు.
ఆదివారం నగరంలోని మహాత్మ జ్యోతిబాపూలే స్మారక పార్క్, సర్కస్ గ్రౌండ్ లో జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఎక్స్ పో2026 నిర్వహిహిస్తోంది. ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ స్టాల్ ను గౌష్ ఆలం (CP Gaush Alam) కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి సందర్శించారు. పోలీస్ కమిషనర్ కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా స్టాల్ లోకి ఆహ్వానించి, గులామ్ అహ్మద్ హుస్సేన్ శీతలపాలయాలను వారికి అందించారు.
సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలాన వలీవుల్లా సయ్యద్ ఫలాహి మాట్లాడుతూ.. గులాం అహ్మద్ హుస్సేన్ లాంటి సెక్యులర్ భావాలు కలిగిన నాయకుడు అని.. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ స్టాల్ ను ఏర్పాటు చేసిన గులాం అహ్మద్ హుస్సేన్ కు, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్, మంకమ్మ తోట డివిజన్ అధ్యక్షుడు ఖైరోద్దీన్ లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సయ్యద్ ఇబ్రహీం, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, ఆరిఫ్ అహ్మద్, లింగపల్లి శ్రీనివాస్, అబ్దుల్లా ఖాన్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు అబ్దుల్ గఫ్ఫార్, సురేశ్, వాజిద్ ఖాన్, ఖాజా మజారోద్దీన్, గాలి రాజు, నాయకులు కింగ్ సాజిద్, మెరాజోద్దీన్, సుల్తాన్ మిర్జా, ఫసియుద్దీన్ ఖాలీద్, ఖమరొద్దీన్ షబ్బీర్, సలీం, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

