కలం, వెబ్ డెస్క్ : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు (Rajya Sabha Election) సంబంధించి ఏడుగురు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అలాగే కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే , పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝా, తమిళనాడు నుంచి ప్రణవ్ చక్రవర్తి, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగీ కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్నారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది.
అయితే కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్ రష్మిలకు ఛాన్స్ వస్తుందని అనుకున్నా.. చివర్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. అవి ఈ ఏడాదికి సంబంధించి జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అటు ఏపీలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 సీట్లు టీడీపీకి, ఒక సీటు జనసేనకు దక్కాయి.

