కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్రానికి వ్యతిరేకంగా మరోసారి ఇండీ కూటమి ఎంపీలు ఆందోళనకు (Delhi Protest) దిగారు. కాంగ్రెస్ శ్రేణులు (Congress) భారీగా తరలివచ్చి నిరసన చేపట్టడంతో జంతర్ మంతర్ దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితిని ముందుగానే ఊహించిన పోలీసులు భారీగా మోహరించారు. ప్రధానంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా ఇండీ కూటమి ఎంపీలు ఈసీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరస్పరం తీవ్ర వాగ్వాదం, తోపులాట జరుగడంతో రాహుల్ గాంధీ, పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

