కలం, హనుమకొండ: ఏఐసీసీ, పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) ఆదేశాల మేరకు సెప్టెంబర్ 28న హనుమకొండలో నిరసన (Congress Protest) కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
అలాగే వరంగల్ జిల్లా ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీనుబాబు, ఎమ్మెల్సీలు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్, పింగిలి వెంకటరమణ, నర్సింహారెడ్డి, ఈ.వి. శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

