‘ఈసీ’ పంచాయతీ.. ఢిల్లీలో CWC మీటింగ్!

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జరుగుతున్న కీలక రాజకీయ పరిణామాల దృష్ట్యా  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress CWC) ఢిల్లీలో భేటీ కానుంది. ఎన్నికల కమిషన్ అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో సెప్టెంబర్ 29, మంగళవారం ఢిల్లీలో మీటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఎన్నికల సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశం తర్వాత పార్టీ తన తదుపరి వ్యూహాన్ని నిర్ణయించనుంది.

కేంద్రం తీసుకువచ్చిన సర్ ప్రక్రియలో భాగంలో ఎన్నికల కమిషన్ తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ ప్రక్రియపై పలు రాష్ట్రాల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) కు జ్ఞానేశ్ కుమార్ కు అభ్యంతరాలు తెలిపినా.. ఆయన పట్టించువాట్లేదనే వార్తలు జాతీయ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీమానా చేయాలని, సమర్థనీయంగా లేని SIR ప్రక్రియతో ఎన్నికలు నిర్వహించిన ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున దీనినే ప్రధాన అస్త్రంగా భావించాలని జాతీయ కాంగ్రెస్ చూస్తుంది. దీనిపై సుదీర్ఘంగా చర్చించి వ్యూహాత్మక నిర్ణయం తీసుకోని కేంద్రం ముందు పలు డిమాండ్లు తీసుకురానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>