కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసిన అధికారులను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు (Congress Councillors) శుక్రవారం ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ, డీఈ, ఏడీలను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని సజావుగా నిర్వహించడంలో, జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించడంలో అధికారులు, సిబ్బంది అందించిన సహకారాన్ని కౌన్సిలర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, మహమ్మద్ జాకీ, మహమ్మద్ రఫీ, ఫేక్ జాకీర్, షేక్ ఫెరోజ్, షేక్ సల్మాన్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ షాకీర్, కోఆప్షన్ సభ్యుడు అస్లాం తదితరులు పాల్గొన్నారు.

