Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ప్రధాన, ప్రతిపక్ష పార్టీల పొలిటికల్ మైండ్ గేమ్!

కలం, తెలంగాణ బ్యూరో: ‘‘జాకీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదు. మా ప్రత్యర్థి కేవలం బీజేపీనే”.. ఇటీవల తరచూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లు ఇవి. ‘‘జారుడు బండ మీద కాంగ్రెస్ ఉంది. వచ్చే ఎన్నికల్లో దానికి థర్డ్ ప్లేసే.. మా పోటీ బీజేపీతో మాత్రమే!’’.. కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్న వ్యాఖ్యలు ఇవి. వీటిని చూస్తుంటే.. బీజేపీకి హైప్ ఇచ్చినట్లు చేసి బీఆర్ఎస్ ను డీమోరల్ చేయాలన్న ఆలోచనలో రేవంత్, కమలం పార్టీని పైకిలేపినట్టు చేసి కాంగ్రెస్ ను డీమోరల్ చేయాలన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నది. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని క్రియేట్ చేసి.. బీఆర్ఎస్ ను ఎలిమినేట్ చేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్. అదే తరహాలో కాంగ్రెస్ ను తప్పించాలన్నది బీఆర్ఎస్ స్కెచ్. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నడుమ ఇలాంటి పర్సెప్షన్ నడవడం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇది పొలిటికల్ గేమ్ ప్లానా? లేక ఆత్మహత్యా సదృశ్యమా? బీజేపీకి మరింత బూస్టప్ ఇచ్చే పరిణామమా? కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం పల్చన చేసుకుంటూ తమను ప్రధాన ప్రత్యర్థిగా ఎక్స్పోస్ చేస్తుండటంతో బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమేనన్న ధీమాలో ఉన్నది.

రాజకీయాల్లో పోటీ కేవలం రెండు పక్షాల మధ్య ఉంటే లాభపడతామన్నది అన్ని పార్టీల భావన. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ది అదే ఆలోచన. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదని, తమకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికే లేదన్న మెసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఇప్పటికే వరుస ఓటములతో కుదేలైన బీఆర్ఎస్ కేడర్ లో స్థైర్యం నింపేందుకు తమది రాష్ట్ర స్థాయి పార్టీ కాదని, దేశాన్ని ఏలుతున్న బీజేపీకి కూడా సమవుజ్జీలమే అనే మైండ్ గేమ్లో గులాబీ పెద్దలు ఉన్నారు. కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోకుండా బీజేపీతోనే తమ పోటీ అని ఇంప్రెషన్ ఇస్తే.. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహం.

‘‘బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో కేటీఆర్ డైరెక్షన్.. ఢిల్లీలో కిషన్ రెడ్డి యాక్షన్..’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి తరచూ విమర్శిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లోనూ ఇవే కామెంట్స్ చేశారు. ‘‘మోదీ, రేవంత్‌రెడ్డి బడే భాయ్ – ఛోటే బాయ్. దిల్ మే మోదీ.. బాహర్ మే రాహుల్.. ఆ రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్..’’ అంటూ కేటీఆర్ చాలాసార్లు విమర్శించారు. తాజాగా మీడియాతోనూ ఇవే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఈక్వేషన్, పొలిటికల్ సెటైర్లు ఒక కొత్త నెరేటివ్‌ను సృష్టిస్తున్నాయి. పరస్పరం విమర్శలు చేసుకుంటూనే.. బీజేపీకి ఎక్కడ లేని హైప్ ఇచ్చి ప్రత్యర్థిని వీక్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమకు ప్రత్యర్థి బీజేపీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో వాటి హోదాను అవే తగ్గించుకున్నాయన్న వాదన కూడా ఉంది.

ఊహించని పర్‌సెప్షన్

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని ఆసక్తికరమైన ‘పొలిటికల్ పర్సెప్షన్ గేమ్ (Telangana Politics)’ నడుస్తున్నది. నిన్నటిదాకా అసెంబ్లీ వేదికగా, సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు నామరూపాలు లేకుండా చేస్తామంటూ కత్తులు దూసుకున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పుడు సడన్‌గా రూట్ మార్చాయి. ‘‘అసలు సిసలు రాజకీయ శత్రువు మాకు కాంగ్రెస్ కాదు.. భారతీయ జనతా పార్టీ’’ అని కేటీఆర్ అంటుంటే.. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? మా ఫైట్ అంతా బీజేపీతోనే’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. రెండు భిన్న ధృవాల పార్టీల అధినేతలు.. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అనే ఒకే రాగం అందుకోవడం, ఒకే మాట అనడం వెనుక రాజకీయ వ్యూహమేంటి?.. పొలిటికల్ ఈక్వేషన్ ఏంటి?.. ఇవే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ను హీట్ పుట్టిస్తున్న ప్రశ్నలు. ఒకరిని ఒకరు సీన్‌లో లేకుండా చేసే వ్యూహమా?.. లేక బీజేపీని ఎక్కువ చేసి చూపడం ద్వారా మానసికంగా దాన్ని బలహీనపరిచే ఎత్తుగడా?.. అనేది ఆసక్తికరం.

ముఖాముఖి పోటీ ఉంటేనే..!

రాజకీయాల్లో పోటీ కేవలం రెండు పక్షాల మధ్యే ఉంటే లాభపడతామని ప్రాంతీయ, జాతీయ పార్టీలు భావిస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నది అదే. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నదని, తమకు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికే లేదన్న మెసేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫ్యూచర్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే నెరేటివ్‌ను క్రియేట్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఆలోచన ఇంకో రకంగా ఉన్నది. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో కేడర్‌లో స్థైర్యం నింపేందుకు పడరాని పాట్లు పడుతున్నది. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పార్టీ కాదని, దేశాన్ని ఏలుతున్న బీజేపీకి కూడా సమవుజ్జీలమే అనే మైండ్ గేమ్ ఆడుతున్నది. కాంగ్రెస్‌ను లెక్కలోకే తీసుకోకుండా బీజేపీతోనే తమ పోటీ అనే ఇంప్రెషన్ ఇస్తే.. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవచ్చనేది బీఆర్ఎస్ ప్లాన్ గా ప్రచారం జరుగుతున్నది.

ఢీకొట్టే స్థాయికి బీజేపీ?

రాష్ట్రంలో తాము వేగంగా బలపడుతున్నామనే సంకేతాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలూ పరోక్షంగా ఈ విమర్శలతో అంగీకరిస్తున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తో పోలిస్తే రెండు శాతం లోపే ఓటు షేర్ తక్కువ వచ్చిందని కేటీఆర్ నిత్యం చెప్తూనే ఇప్పుడు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా పేర్కొనడం గమనార్హం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ సహా చుట్టూ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికీ తామే బలంగా ఉన్నామని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. కానీ జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకోవడంతో ఎక్కడో తేడా కొడుతుందనే ఉద్దేశంతో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు పెడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే బలపడాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి ప్రత్యర్థిగా బీజేపీని ఆ రెండు పార్టీలూ పరోక్షంగా ప్రమోట్ చేస్తుండటం.. బీజేపీ తనకు తానుగా చేసుకునే ప్రచారానికి ఒకింత బలం చేకూరినట్లయింది.

బీఆర్ఎస్ చచ్చిపోయిందని, జాకీలు పెట్టి లేపినా లేవదని, దానికి గతమే తప్ప భవిష్యత్తు లేదని.. ఇలా అనేక రకాలుగా ఆ పార్టీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. మాయ మాటలతో, ఆరు గ్యారంటీలతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని.. వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌కు వంద సీట్లు ఖాయమని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ తమకు పోటీయే, బీజేపీతోనే పోటీ అని బీఆర్ఎస్ అంటున్నది. బీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదని కాంగ్రెస్ అంటున్నది. దీంతో ఈ రెండు పార్టీలూ తమకు పోటీ బీజేపీతోనే అని చెప్తున్నాయి. ఒకదాన్ని మరొకటి పల్చన చేసే క్రమంలో బీజేపీకి కొత్త క్రెడిట్ ఇస్తున్నాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానిని మరొకటి బలహీనపరిచే ప్రయత్నంలో బీజేపీకి అనుకోకుండా రాజకీయ ప్రయోజనం కల్పిస్తున్నాయన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీల వ్యూహం బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇద్దరూ కలిసి టార్గెట్ చేస్తుండడంతో సహజంగానే బీజేపీ సింపతీ కార్డ్ ప్లే చేసి ఆ రెండింటినీ ఢీకొట్టే స్థాయికి చేరొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>