భైంసాలో ‘గ్రీవెన్స్ డే’.. అధికారులకు ఎస్పీ కీలక ఆదేశాలు!

కలం, భైంసా: భైంసా (Bhainsa) పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ‘గ్రీవెన్స్ డే’ (Grievance Day) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

కుటుంబ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు షీ టీం సిబ్బందితో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భైంసాలోనే కౌన్సెలింగ్ సదుపాయం కల్పించడంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత గ్రీవెన్స్ డేలలో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులపై ఎస్పీ సమీక్షించారు. బాధితులకు త్వరగా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>