Mobile Popup Ad
Mobile Popup Ad

మూడు దశల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ: కలెక్టర్ ప్రతిమా సింగ్

కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర నిర్వాహకులను, వ్యవసాయ, సివిల్ సప్లై అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ( Collector Pratima Singh) ఆదేశించారు. హవేలీ ఘన్ పూర్ మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా సాగేందుకు మూడు దశల్లో టోకెన్ పద్దతిని పెట్టినట్లు తెలిపారు. దీనిని ఆయా శాఖల అధికారులు తూచా తప్పకుండా పాటించడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేమ శాతం వచ్చిన ధాన్యం వేగంగా కొనుగోలు అవుతుందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యం బస్తాలను తరలించాలని సూచించారు. రవాణా పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తగు లారీలను నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయంలో వచ్చేలా పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>