Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ పోతే ఆ పార్టీ, డబ్బులు నాకు రావు: సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని తానెప్పుడూ కోరుకుంటానని, ఆయన పోతే బీఆర్ఎస్ పార్టీ, డబ్బులు తనకు రావు కదా.. అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేసీఆరర్ విశ్రాంత ప్రజాప్రతినిధి, అలాంటి వాళ్ల చావు తాను కోరుకోనని స్పష్టం చేశారు. ఆయనకు గతంలో కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఆసుపత్రికి స్వయంగా వెళ్లి, కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు గుర్తు చేశారు. అసెంబ్లీకి ఒక్కసారే వచ్చినా.. వెళ్లి పలకరించినట్లు వివరించారు. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని.. శత్రువు కాదని మరోసారి స్పష్టం చేశారు.

‘కేసీఆర్ పై విజయం సాధించాను..’

ఎన్నికల్లో గెలిచి, సీఎం అవడం ద్వారా కేసీఆర్ పై విజయం సాధించేశానని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే తాను సీఎం కావాలని కేటీఆర్ కొంత మందితో ప్రకటనలు కూడా ఇప్పించారు. కేసీఆర్ అధికారాన్ని నేను గుంజుకున్నా. ఆయన బతికి ఉంటే, తమకు అధికారం రాదని.. కేసీఆర్ కు చెడు జరగాలని వాళ్ల కుటుంబమే కోరుకుంటుంది. పంపకాల్లో తేడా వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. అనుబంధ సంఘాలను మనపై రుద్దాలని చూస్తున్నారు. వాళ్లు వాళ్లు ఒక్కటే. ఒక చెరువులోని నీరే’ అని పేర్కొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>