వృద్ధుల సంక్షేమంపై కలెక్టర్ ఫోకస్

కలం, చౌటుప్పల్: వృద్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యం, మానసిక ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) అన్నారు. బుధవారం చౌటుప్పల్(Choutuppal) మండలం పెద్దకొండూరు గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుబంధంతో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి యాదాద్రి సేవాశ్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆశ్రమంలో ప్రస్తుతం ఎంతమంది వృద్ధులు ఉంటున్నారని, వారికి కల్పిస్తున్న వసతులు, ప్రతిరోజూ అందిస్తున్న భోజన సదుపాయాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించారు. వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయించడంతో పాటు క్యారమ్స్, ఇతర ఆటలు ఆడిస్తున్న నిర్వాహకుల తీరును కలెక్టర్ అభినందించారు. వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, శిశు సంక్షేమ అధికారి శ్రీనివాస్, సాయి సేవాశ్రమం నిర్వాహకులు అశోక్, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>