Mobile Popup Ad
Mobile Popup Ad

జూరిచ్ క్లాసిక్ విజేతగా మ్యాట్ ఫిట్జ్‌పాట్రిక్ బ్రదర్స్!

కలం, వెబ్ డెస్క్ : బ్రిటీష్ గోల్ఫ్ స్టార్ మ్యాట్ ఫిట్జ్‌పాట్రిక్ (Matt Fitzpatrick) తన విజయ పరంపరను కొనసాగిస్తూ మరో ఘనతను అందుకున్నారు. ఆదివారం జరిగిన జూరిచ్ క్లాసిక్ ఆఫ్ న్యూ ఓర్లీన్స్ టోర్నీలో ఆయన తన సోదరుడు అలెక్స్ ఫిట్జ్‌పాట్రిక్‌ (Alex Fitzpatrick) తో కలిసి అద్భుత ప్రదర్శన కనబరిచి టైటిల్ గెలుచుకున్నారు. చివరి రౌండ్‌లో ఈ సోదర జోడీ 1-అండర్ 71 స్కోరు నమోదు చేసి మొత్తం 31-అండర్ వద్ద నిలిచారు.

కేవలం ఒక్క షాట్ తేడాతో క్రిస్టోఫర్ రీటన్, క్రిస్ వెంచురా జంటపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో మ్యాట్ ఫిట్జ్‌పాట్రిక్ ఒకే సీజన్‌లో మూడు టైటిళ్లు గెలిచిన అరుదైన ఘనతను సాధించారు. అలాగే పీజీఏ టూర్‌లో అత్యధిక విజయాలు సాధించిన బ్రిటిష్ గోల్ఫర్ల జాబితాలో లూక్ డొనాల్డ్ సరసన చేరారు. మొత్తం ఐదు టైటిళ్లతో ఆయన ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

గత రెండేళ్లుగా ఎదురుచూసిన విజయాలకు బ్రేక్ వేస్తూ 2026 సీజన్‌లో వరుసగా వాల్‌స్పార్ ఛాంపియన్‌షిప్, ఆర్‌బీసీ హెరిటేజ్, ఇప్పుడు జూరిచ్ క్లాసిక్‌తో హ్యాట్రిక్ సాధించారు. విజయం అనంతరం మ్యాట్ ఫిట్జ్‌పాట్రిక్ మాట్లాడుతూ, ఈ గెలుపు తనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, సోదరుడితో కలిసి సాధించిన ఈ విజయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రదర్శన అత్యుత్తమ స్థాయిలో కొనసాగుతుండటంతో, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>