సిద్దిపేటకు చేరుకున్న సీఎం రేవంత్.. కాంగ్రెస్‌లో జోష్!

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిద్దిపేటకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో డిగ్రీ కాలేజీ మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించనున్నారు. అక్కడి నుంచి పట్టణంలో రెండు కిలోమీటర్ల భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టి.. ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రదేశానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట (Siddipet) నుంచి రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు 5 లక్షల చొప్పున ప్రమాద బీమా కల్పించే పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

సిద్దిపేట నియోజకవర్గం, జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ అక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత మూడోసారి సిద్దిపేటకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అదే సమయంలో ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న హరీశ్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Also Read : కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం: కేటీఆర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>