భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, తెలుగు జాతి చేత ‘అన్న’ అని పిలుపించుకుని గౌరవాన్ని పొందిన వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మైత్రివనం జంక్షన్ వద్ద ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహ ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హామినిచ్చిన సీఎం ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. భారత దేశ చరిత్రను స్మరించుకోవాలంటే అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి ముగ్గురు జాతిరత్నాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>