22ఏ భూముల‌పై సీఎం రేవంత్ కీల‌క స‌మీక్ష‌

క‌లం, వెబ్‌డెస్క్‌: నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించార. ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌నలు, గంద‌ర‌గోళం నెల‌కొన్న నేప‌థ్యంలో దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధికారులతో సీఎం అన్నారు. 22 ఏ భూముల జాబితాను క‌లెక్ట‌ర్లు క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని సూచించారు. ప్రైవేటు భూమి అని తేలితే వెంట‌నే రిజిస్ట్రేష‌న్ చేయాల‌ని ఆదేశించారు.

ప్ర‌జ‌ల ఆస్తి హ‌క్కుల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు క‌ట్టుక‌థ‌లు, పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు. 22 ఏ జాబితాలో ఉన్న భూముల ప‌రిశీల‌న‌ను క‌లెక్ట‌ర్లు రెండు రోజుల్లో పూర్తి చేయాల‌ని సీఎం సూచించారు. ఈ భూముల విష‌యంలో ఎవ‌రూ మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ఆశ్ర‌యించ‌వ‌ద్ద‌ని, ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా న్యాయం చేస్తుంద‌ని సీఎం అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>