కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పొగడ్తల వర్షం కురిపించారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతర నిర్వహించిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. అసదుద్దీన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దేశ భక్తిలో మోదీ, అమిత్ షాతో ఒవైసీ సోదరులు తీసిపోరని కొనియాడారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టింది తప్పా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
తాను సీఎం అయ్యాక అక్బర్, అసదుద్దీన్(Asaduddin Owaisi)తో ఓల్డ్ సిటీలోని గల్లీగల్లీలో తిరుగుతూ అభివృద్ధిపై చర్చించానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. 70 ఏళ్లలో 18మంది ముఖ్యమంత్రులు అయినా ఎవరైనా ఓల్డ్ సిటీకి వచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. పాతబస్తీ గల్లీలోకి తాను తప్ప ఇంకెవరూ రాలేదన్నారు. ఓల్డ్‌సిటీ అభివృద్ధి కోసం అసద్ భాయ్ ఏం చెప్పినా.. వెంటనే మంజూరు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Also Read : కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై చిన్నారెడ్డి షాకింగ్ రియాక్షన్
Follow Us On: X(Twitter)

