Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

కలం, వెబ్ డెస్క్ : నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లాల పర్యటన షురూ కానుంది. ఈ మేరకు జూన్ 1 నుంచి 4 వరకు పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత సోమవారం ( జూన్ 1) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

పర్యటనలో భాగంగా చింతలమానేపల్లి మండలంలోని కౌటాల (రవీంద్రనగర్ క్యాంపు నం-2) గ్రామంలో ఏర్పాటు చేయనున్న రూ.56.55 కోట్ల అంచనా వ్యయం గల 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రెబ్బెన మండలం నాంబాల్ గ్రామంలో రూ.6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఉపకేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది.

మరోవైపు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>