కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా చిట్ చాట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వంద శాతం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటం లేదని, దొంగచాటున ఇతరుల మాటలు వింటే మనశ్శాంతి పోతుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమ వ్యవహారాలపై విచారణ సాగుతోందని, ఈ క్రమంలో విచారణకు హాజరవుతున్న వారంతా ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియలో భాగస్వాములైన వారేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే ప్రస్తుతం ఇతరుల విచారణ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పైనున్న వారు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశామని ప్రభాకర్ రావు స్వయంగా అంగీకరించారని, ఉన్నతాధికారుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో దీని ద్వారా అర్థమవుతోందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు.
Read Also: అమెరికా డీడీజీఎస్.. భారత రైతులకు తీవ్ర నష్టం..?
Follow Us On: Youtube


