కరీంనగర్, ఖమ్మం, వరంగల్పై ఫోకస్.. సీఎం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ లకి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారు.అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) పెవిలియన్ లో మెగా గ్రోత్ కారిడార్ పై సీఎ సమీక్ష చేపట్టారు. ఈ మీటింగ్ కు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు.

ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలు..

రాబోయే ఎయిర్ పోర్టులను దృష్టిలో ఉంచుకొని రోడ్లను నిర్మించాలని సీఎం చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ లు అర్బన్ ప్లానింగ్ లో తప్పని సరిగా ఉండాలని చెప్పారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ తగ్గించడానికి మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలి..

ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ వినియోగంపై సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు నుంచి శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వాడేలా నిబంధన పెట్టాలని చెప్పారు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్ గా చేయాలని.. సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సూచించారు. నల్గొండ, యాదగిరి గుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్ లను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్లలను కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగూడం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా ప్రతిదీ డిజైన్ చేయాలని ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>