ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: సచివాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా బిజినెస్‌ రిఫార్మర్ అవార్డు దక్కించుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, కలెక్టర్లు, అధికారులు అభినందనలు తెలియజేశారు. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వ సమర్థత మరింత మెరుగుపరిచేలా సదస్సులో చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రజా అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యతలనే లక్ష్యంతో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. తొలుత నేడు 10 సూత్రాలు, జిల్లాలవారీగా జీఎస్డీపీ వృద్ధి, కేంద్ర పథకాలపై సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారం, కంపెనీల గ్రౌండింగ్, దస్త్రాల క్లియరెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలను సీఎంకు మంత్రులు వివరించారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఅండ్​పీఆర్​ వ్యవస్థ పని చేయకుండా ఆభరణంలా మారిందని చెప్పారు. ఇన్‌ఫ్లూయెన్సర్ల సహాయంతో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటే అరకులో కాఫీ పంట ఉంటుందా అని ప్రశ్నించిన సీఎం, అధికారుల ప్రవర్తన మార్చుకొని అభివృద్ధికి దోహదపడాలన్నారు. అధికారుల పనితీరు అభివృద్ధిని అడ్డుకునేలా ఉండటం సరికాదని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>