అమ‌రావ‌తిలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌షిప్ సెంట‌ర్: సీఎం చంద్ర‌బాబు

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి (Amaravati)లో క్వాంటం కంప్యూట‌ర్ల‌ను నిర్వ‌హించ‌డ‌మే కాకుండా రెండేళ్ల‌లో ఎగుమ‌తి కూడా చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు (Chandrababu) అన్నారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు సీఐఐ సదస్సును నిర్వహించేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదన్నారు. నేడు అందరూ నిర్వహించాలని కోరుకుంటున్నారని తెలిపారు. సీఐఐ వేదికను నిర్వహించేందుకు ఏపీకి పూర్తి హక్కు ఉందని స్పష్టం చేశారు. అలాగే తాను హాజరవుతున్న తొమ్మిదో సీఐఐ సదస్సు ఇదేన‌ని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గత 25 ఏళ్లుగా నిరంతరం ప్రజా జీవితంలో కొనసాగడానికి ప్ర‌జ‌ల‌ విశ్వాసమే కారణమని కొనియాడారు.అమరావతిలో కేవలం ఏడాది క్రితమే క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) ప్రాజెక్టును తలపెట్టామని సీఎం (Chandrababu) వెల్ల‌డించారు. ఫిబ్రవరి 3న క్వాంటమ్ కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సీఐఐ భాగస్వామ్యం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Also Read : జ్ఞానేష్ కుమార్‌కు మాజీ జడ్జిల మద్దతు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>