విపత్తు వస్తే నాకు నిద్ర పట్టదు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఏపీకి ఎలాంటి విపత్తు వచ్చినా తనకు నిద్ర పట్టదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అర్నబ్ తుఫాన్‌ వచ్చిన రోజు ఒక గంటన్నర మాత్రమే పడుకుని.. తెల్లవారుజామున 4 గంటలకే మరోసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించానని వివరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వీలైనంత మేరకు ప్రయత్నించామన్నారు. దురదృష్టవశాత్తూ ఏడుగురు చనిపోయారని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం చంద్రబాబు.. కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని.. ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రజలకు తక్షణం కొంత సాయం అందిస్తామని.. నష్టం వివరాలు అంచనా వేసి తరువాత పూర్తి పరిహారాన్ని ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు.

రేపు కేంద్ర బృందాల రాక..

అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) కారణంగా ఏపీకి కలిగిన నష్టాన్ని ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో వివరించినట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. రేపు కేంద్ర అధికార బృందాలను పంపిస్తున్నామని చెప్పారని వివరించారు. వారు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చాక.. అక్కడి నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. 30 ఏళ్ల కిందట తుఫాన్ వచ్చిన దృశ్యాలు తన కళ్ల ముందు ఇంకా కదలాడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పట్లో ఆర్మీ సిబ్బంది వారించినా.. వరద ప్రాంతాలకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అమెరికా లాంటి దేశాల్లో విపత్తులు వస్తే.. మళ్లీ కోలుకోవడానికే రెండు నెలల సమయం పడుతుందన్నారు. అలాంటిది తాము తుఫాన్ వచ్చిన సాయంత్రానికే కరెంట్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.

Also Read : ‘అర్నబ్’ తుఫాన్ బీభత్సం.. చంద్రబాబుకు అమిత్ షా కీలక హామీ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>