టైర్ పేలి మంటల్లో చిక్కుకున్న కారు.. డ్రైవర్ సజీవదహనం!

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారి (Anandapuram Highway) పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్ లో ఉన్న కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం అదుపుతప్పి డివైఢర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ బయటకు రాలేక లోపలే చిక్కుకుని సజీవదహనమయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఆనందపురం హైవేపై కారు వేగంగా వెళ్తుండగా, ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. టైర్ పేలిన వెంటనే కారు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. గాలి వేగానికి మంటలు క్షణాల్లోనే కారు మొత్తానికి వ్యాపించాయి.

మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడం, కారు డోరు తెరుచుకోకపోవడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుని మంటల్లో సజీవదహనమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>