కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని ప్రసిద్ధ జంతర్ మంతర్ వద్దకు అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు (CJP Leaders) సౌరవ్ దాస్, ఆశుతోష్లకు కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు వీరిద్దరినీ వెంటనే తీహార్ జైలుకు తరలించారు. అనుమతి లేని ప్రాంతంలోకి నిరసన తెలపడానికి చొరబడ్డారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు వీరిపై అభియోగాలు నమోదు చేశారు.
అయితే పోలీసుల వాదనను సౌరవ్ దాస్, ఆశుతోష్ తరఫు న్యాయవాది ఖండించారు. జంతర్ మంతర్ వద్దకు రావాలని ప్రజలకు వీరు పిలుపునిచ్చారని పోలీసులు కోర్టులో పూర్తిగా అబద్ధాలు చెప్పారని లాయర్ స్పష్టం చేశారు. నాయకులు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, ఎలాంటి బాండ్ను కూడా దాటలేదని తెలిపారు. కేవలం రాజకీయ ప్రేరేపితంగానే పోలీసులు తప్పుడు నివేదిక సమర్పించి కస్టడీ కోరారని, దీనిపై తదుపరి చట్టపరమైన పోరాటం చేస్తామని లాయర్ వెల్లడించారు.

