కాకి దుస్తుల వెనుక కపట ప్రేమ.. గర్భవతిని చేసి..

కలం, ​బూర్గంపాడు: చట్టాన్ని రక్షించాల్సిన ఆ రక్షకుడే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ప్రేయసిని దారుణంగా మోసగించాడు. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఒక యువతి జీవితాన్ని నడిరోడ్డున పడేసిన ఘాతక ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampahad) మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. ​మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన శివాని అనే యువతిని బూర్గంపాడు ప్రాంతానికి చెందిన తోకల సాయికుమార్ గత మూడేళ్లుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు.

ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి పలు ప్రాంతాల్లో ఆ యువతితో గడిపాడు. తీరా ఆ యువతి గర్భవతి అయిన తర్వాత అతను తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. బాధ్యత తీసుకోకుండా ముఖం చాటేయడమే కాకుండా, బాధితురాలికి తెలియకుండా ఇటీవల రహస్యంగా వేరే పెళ్లి చేసుకున్నాడు.

​తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన బాధితురాలు..బూర్గంపాడులోని ఎస్సీ కాలనీలో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్ ఇంటి వద్దకు చేరుకుని నేరుగా నిలదీసింది. తనకు తక్షణమే న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందే ఆందోళనకు దిగడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాకి దుస్తుల వెనుక దాగున్న కపట ప్రేమను ఎండగడుతూ, మోసానికి పాల్పడిన కానిస్టేబుల్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.

​ఈ ఘటనపై బాధితురాలు బుధవారం స్థానిక బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడైన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తోకల సాయికుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్.హెచ్.ఓ మేడ ప్రసాద్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>