కలం, వెబ్ డెస్క్ : మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా సుర్తి తండాలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో బిస్కెట్ ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి ఊపిరాడక మృతి చెందాడు. మూడవత్ శ్రీను, మౌనిక దంపతుల పిల్లలు శనివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా, వంట చేసేందుకు వెళ్తున్న తల్లి వారికి తినడానికి బిస్కెట్లు ఇచ్చింది.
బిస్కెట్ తింటున్న సమయంలో అది గొంతులో చిక్కుకోవడంతో చిన్నారి శ్వాస ఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పసికందు మరణంతో సుర్తి తండాలో శోకసంద్రం అలుముకుంది.

