Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ పరిస్థితి వైకుంఠపాళిలా తయారైంది : సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ పరిస్థితి వైకుంఠపాళిలా తయారైందన్నారు. తాను అభివృద్ధిలో పైకి తీసుకెళ్లడం.. ఆ తర్వాత ప్రజలు ప్రభుత్వాన్ని మార్చితే కిందకు వెళ్లడం.. మళ్లీ పైకి తీసుకెళ్లే బాధ్యత మళ్లీ తాను తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. వైసీపీ హయాంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని.. ఇప్పుడు తమకు అడుగడుగునా అప్పులే ఎదురవుతున్నాయంటూ చెప్పారు సీఎం.

సంక్షేమ పథకాల అమలుకు ఖజానాలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు (Chandrababu) చెప్పారు. ఉగాది పర్వదినాన రైతుల ముఖంలో సంతోషం చూడాలనే ఉద్దేశంతోనే అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ చేశామని సీఎం తెలిపారు. ఏపీ రైతులు దేశంలోనే ధనికంగా మారాలని.. అందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>