చంద్రబాబు రెండేళ్ల పాలనపై కొడాలి నాని సెటైరికల్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సెటైరికల్ కామెంట్స్  చేశారు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు కేవలం డాన్సులు, సొల్లు కబుర్లతోనే కాలక్షేపం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దాన్ని కాస్తా ‘సూపర్ సున్నా’గా మార్చేశారని ఫైర్ అయ్యారు.

అంతేకాదు ఈ రెండేళ్లలో ప్రధాని మోదీ ఎదురైతే వంగి వంగి దండాలు పెట్టడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే కూర్చోబెట్టి ముచ్చటించడం తప్ప చంద్రబాబు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. మైక్ దొరికితే.. జగన్ సైకో అని, వైసీపీ గొడ్డలి పార్టీ , గాడిద గుడ్డు అంటూ నిందలు వేయడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. బాబు మార్కు పాలనపై ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని .. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిందేమీ లేదని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>