ఖైరతాబాద్ మహా గణపతి ముస్తాబు.. తొలి పూజ ఎప్పుడంటే!

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో సహా దేశం దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ మహా గణపతి (Khairatabad Ganesh) భక్తులకు దర్శనం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలువుదీరాడు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతుల చేతుల మీదుగా తొలి పూజ జరగబోతుంది. అనంతరం, పలువురు ప్రముఖులు వచ్చి గణనాథుడిని దర్శంచుకోనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 72 ఏళ్లుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు.

భారీ బందోబస్త్ ఏర్పాట్లు..

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు రానుండటంతో పోలీసులు కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా దర్శనానికి వస్తుండటంతో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా పోలీసులను మోహరించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా కెమెరాలతో పరిశీలిస్తున్నారు. గణేషుడి పరిసరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>