మోదీ ఫారిన్ ట్రిప్స్‌.. ఖ‌ర్చులు చూస్తే షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రధాని మోదీ (PM Modi) విదేశీ పర్యటనల కోసం 2021 నుంచి ఈ ఏడాది జులై వరకు రూ.557.51 కోట్లు ఖర్చయినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సీపీఐ ఎంపీ వి.శివదాసన్ అడిగిన ప్రశ్నలకు కేంద్రం గురువారం రాజ్యసభలో రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రధాని ఫారిన్ ట్రిప్స్ కోసం ఈ ఏడాది జులై వరకు రూ.74.59 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఈ ఏడాది మోదీ మొత్తం 13 దేశాలను సందర్శించారని తెలిపింది. ఇందులో మలేసియా, ఇజ్రాయెల్, యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ, ఫ్రాన్స్, స్లోవేకియా, షీషెల్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నట్టు పేర్కొంది. వీటిలో అత్యధికంగా నార్వే ట్రిప్‌కు రూ.17.46 కోట్లు, ఇజ్రాయెల్ ట్రిప్‌కు రూ.11.92 కోట్లు ఖర్చయినట్టు తెలిపింది.

మోదీకి నెతన్యాహు ఫోన్

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. నెతన్యాహు గురువారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, డిఫెన్స్, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని నిర్ణయించారు. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>