సీజేపీ నేత‌ల‌తో కేంద్రం చ‌ర్చ‌లు ప్రారంభం

క‌లం, వెబ్‌డెస్క్‌: ఢిల్లీలో మ‌రోసారి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) ప్ర‌తినిధుల‌తో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నుంచి సౌర‌వ్ దాస్‌, అశుతోష్ చ‌ర్చ‌ల‌కు హాజ‌ర‌య్యారు. కేంద్ర మంత్రులు జేపీ న‌డ్డా, జితేంద్ర సింగ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌ర‌య్యారు. కాక్రోచ్ పార్టీ ప్ర‌తినిధుల‌తో కేంద్రం చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఇది మూడోసారి. చ‌ర్చ‌ల‌కు ముందే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. త‌మ నిర‌స‌న‌లు ముగించేందుకు సీజేపీ ప్ర‌ధానంగా మూడు డిమాండ్ల‌ను కేంద్రం ముందుంచింది. అందులో ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా, నిర‌స‌న‌కారుల‌పై కేసుల ఎత్తివేత‌, ఆత్మ‌హ‌త్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని పేర్కొంది.

వీటిలో రెండు డిమాండ్ల‌కు కేంద్రం శుక్ర‌వారం జ‌రిగిన చ‌ర్చ‌ల అనంత‌రం అంగీకారం తెలిపింది. ధ‌ర్మేంద్ర రాజీనామాపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. తాజాగా నేడు చ‌ర్చ‌ల‌కు ముందే ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా ప్ర‌క‌టించారు. దీంతో సీజేపీ (Cockroach Janta Party) మ‌ద్ద‌తుదారులు సైతం త‌మ ఆందోళ‌న‌లు విర‌మించి జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నుంచి తిరిగి వెళ్తామ‌ని చెప్పారు. కేంద్రం త‌మ డిమాండ్లు ఆమోదించిన‌ట్లు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌ని సీజేపీ ప్ర‌తినిణ‌ధులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>