విద్యార్థినిలకు అండగా ‘పోలీస్‌ అక్క’.. సరికొత్త కార్యక్రమం!

కలం, మెదక్ బ్యూరో : విద్యార్థినుల భద్రతకు ‘పోలీస్‌ అక్క’ అండగా నిలుస్తుందని, విద్యార్థినులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ‘పోలీస్‌ అక్క’ను సంప్రదించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మెదక్ (Medak) జిల్లా పెద్ద శంకరంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ‘పోలీస్‌ అక్క’ అనే సరికొత్త కార్యక్రమాన్ని ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్‌ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థినుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ‘పోలీస్‌ అక్క’లు కృషి చేస్తారని తెలిపారు. మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌–112, షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని, సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌ లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.

Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>