కలం, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు (Parliament Sessions) ముహూర్తం కుదిరింది. ఒక రోజు పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 30 నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు జరుగున్నాయి. కీలక ప్రభుత్వ కార్యకలాపాలే లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ 131 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఈ రెండు బిల్లుల ఆమోదం కీలకం కానుంది. సర్‌పై విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో సమావేశాలు ఎలా జరుగుతాయోనని ఉత్కంఠ నెలకొంది.
Also Read : కేసీఆర్ పాలమూరు బిడ్డల గుండెలపై తన్నాడు: సీఎం రేవంత్
Follow Us On: Youtube

