కేసీఆర్ పాల‌మూరు బిడ్డ‌ల గుండెల‌పై త‌న్నాడు: సీఎం రేవంత్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: అధికారంలోకి వ‌చ్చిన 34 నెల‌ల్లో ఒక్క గంట కూడా సెల‌వు తీసుకోలేద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో సుమారు రూ.450 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌నలు చేశారు. అచ్చంపేట‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన రోజు సోనియా గాంధీ తెలంగాణ‌ను ధ‌నిక రాష్ట్రంగా కేసీఆర్‌కు అప్ప‌గించార‌న్నారు. అలాంటిది ప‌దేళ్ల‌లో క‌ల్వ‌కుంట్ల కుటుంబం రూ.8 ల‌క్ష‌ల కోట్ల అప్పులపాలు చేశార‌ని మండిప‌డ్డారు. క‌నీసం ఉద్యోగుల‌కు మొద‌టి తారీఖున‌ జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి తెచ్చిపెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు విడ‌త‌ల వారీగా జీతాలు ఇచ్చే ప‌రిస్థితిలో పాల‌న చేప‌ట్టామ‌ని చెప్పారు.

ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 2024 జ‌న‌వ‌రి నుంచి మొద‌టి తేదీన జీతాలు ఇస్తున్నామ‌ని సీఎం తెలిపారు. నాడు కేసీఆర్ వ‌రి వేసుకుంటే ఉరేన‌ని చెప్తే.. అప్పుల పాలై ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న రైతుల‌కు వ‌రి కొంటామ‌ని భ‌రోసా ఇచ్చి, స‌న్న వ‌డ్లు వేస్తే బోన‌స్ ఇస్తూ ఆదుకుంటున్నామ‌ని చెప్నారు. రైతు భ‌రోసా పేరు మీద నేటి వ‌ర‌కు 36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామ‌న్నారు. రైతులు పండించిన పంట‌కు 90 వేల కోట్లు చెల్లించి వ‌డ్లు కొన్నామ‌న్నారు. అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోతే ఎక‌రాకు రూ.10 వేలు అందించామ‌న్నారు. ఎరువులు స‌బ్సిడీలో అందిస్తున్నామ‌న్నారు.

రైతుల కోసం 34 నెల‌ల్లో ల‌క్షా 78 వేల కోట్ల రూపాయ‌లు క‌ష్ట‌పెట్టి రైతును రాజును చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని సీఎం (Revanth Reddy) అన్నారు. అచ్చంపేట లిఫ్ట్, డిండి, ఎస్ఎల్‌బీసీ, బీమా, కోయిల్ సాగ‌ర్‌, జూరాల , గూడెందొడ్డి ప్రాజెక్టుల‌న్నీ కేసీఆర్ ప‌డావు పెట్టార‌న్నారు. పాల‌మూరు ప్రాజెక్టుల‌కు కేసీఆర్ రూ.10 వేల కోట్లు కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌న్నారు. 2009లో పాల‌మూరు బిడ్డ‌లు కేసీఆర్‌ను గుండెల మీద పెట్టుకొని గెలిపిస్తే, ఆ గ‌జ‌దొంగ వారి గుండెల‌పై త‌న్ని మెద‌క్‌కు పారిపోయాడ‌న్నారు. వ‌ల‌స‌ల జిల్లా, ఆత్మ‌హ‌త్య‌ల జిల్లా అయిన పాల‌మూరు బిడ్డ‌ల‌ను కేసీఆర్ అవ‌మానించాడ‌న్నారు. పాల‌మూరు బిడ్డ‌లు న‌మ్మితే ప్రాణం ఇస్తార‌ని చెప్పారు. పాల‌మూరు బిడ్డ‌గా ఇక్క‌డి ప్ర‌జ‌ల కోసం ఎంతో కొంత చేసుకోవాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు.

Also Read : అధికారం కోల్పోతే బీజేపీ చచ్చిన పాముతో సమానం: సీఎం రేవంత్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>